ETV Bharat / state

మేమున్నామనీ.. మీకేం కాదని.. - LOCK DOWN PROBLEMS

అసలే లాక్​డౌన్​... అందులో అర్ధరాత్రి... ఇంతటి విపత్కర పరిస్థితిలో ఓ గర్బిణీకి పురిటి నొప్పులొచ్చాయి. ఎటూ పోలేని పరిస్థితి... ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఆదుకున్నారు. ఆస్పత్రిలో చేర్చి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడారు పోలీసులు.

POLICE HELPED TO PREGNANT IN MIDNIGHT
మేమున్నామనీ.. మీకేం కాదని..
author img

By

Published : Apr 26, 2020, 12:13 PM IST

కొత్తగూడెం బర్లిఫీట్‌కు చెందిన రాధిక(24)కు శుక్రవారం అర్ధరాత్రి పురిటినొప్పులు వచ్చాయి. ఆ సమయంలో ఏం చేయాలో తోచక... ఓ స్థానికురాలు ఒకటో పట్టణ సీఐ రాజుకు విషయాన్ని ఫోన్‌లో వివరించారు. వెంటనే స్పందించిన సీఐ... ఎస్సై తిరుపతితో పాటు ఇద్దరు సిబ్బందిని ఘటనా స్థలికి పంపించారు.

పోలీస్‌ వాహనంలో రాధికను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. తెల్లవారుజామున ఆడ శిశువుకు రాధిక జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఐదు దశల్లో లాక్​డౌన్ ఎత్తివేత- రూల్స్ ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.