భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమురం పంచాయతీ పరిధిలోని దేశ్య తండా శివారులో 32 టన్నుల రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారు. ముందస్తు సమాచారం మేరకు తహసీల్దార్ ముత్తయ్య , పోలీసులు దాడి చేశారు.
బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిల్వ ఉంచిన వారి కోసం దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రవి కుమార్ తెలిపారు.