అటవీ భూములను రక్షించేందుకు కృషి చేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారులు అన్నారు. అటవీ శాఖ భూముల్లో వ్యవసాయం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇల్లందు మండలంలోని మిట్టపల్లి పంచాయతీ పరిధిలో అటవీ శాఖ అధికారులు చేపడుతున్న కందకం పనులను పోడు రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోగా.. అధికారులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఎన్నో ఏళ్లుగా పోడు చేసుకుని బతుకుతున్నామని, అధికారులు సర్వే కూడా చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.