ETV Bharat / state

నేతల పర్యటనల్లో తీవ్రమవుతున్న పోడు రైతుల పోరు

ముఖ్యమంత్రి పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని ప్రకటించడం వల్ల ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగులుతోంది. నేతల పర్యటనల్లో పోడు రైతుల నుంచి ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రి పరిష్కరిస్తానని చెప్పడం, దీనిపై ఎటువంటి పురోగతి లేకపోవడం వల్ల ఎమ్మెల్యేల్లో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురవుతోంది.

podu farmers problems in bhadradri kothgudem district
నేతల పర్యటనల్లో తీవ్రమవుతున్న పోడు రైతుల పోరు
author img

By

Published : Jun 10, 2020, 11:27 PM IST

పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి ప్రకటించడం వల్ల పోడు భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగులుతోంది. మరోవైపు అటవీశాఖ అధికారులు సర్వేలు, కందకాల పేరిట పోడు భూముల్లో కార్యకలాపాలు చేస్తుండడం వల్ల పోడు భూముల రైతుల్లో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ సింగరేణి మండలంలో పర్యటించినప్పుడు పోడు రైతులు అడ్డుకుని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసి నినాదాలు చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని మొండితోగు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే హరిప్రియను పోడు రైతులు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని, తమకు పట్టాలు ఇప్పించాలని కోరారు. వారిని సముదాయించి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పోడు భూములలో రైతుల సమస్యల పరిష్కారం చేస్తామని తెలిపారు. పట్టాలు ఉన్న పోడు భూములలో అటవీశాఖ అధికారులు ఎటువంటి ఇబ్బందులు కలుగ చేయకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇల్లందులో పర్యటించి పోడు భూముల సమస్య ప్రధాన అంశంగా మాట్లాడారు. మంత్రులు ఒకవైపు పోడు భూములలో జోక్యం చేసుకోమని చెబుతున్నప్పటికీ అదిలాబాద్​ నుంచి ఇల్లందు వరకు పోడు భూములలో అటవీశాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ముఖ్యమంత్రే స్వయంగా పోడు భూముల సమస్య పరిష్కారం చేస్తానని చెప్పడం.. దీనిపై ఎటువంటి పురోగతి లేకపోవడం వల్ల ఎమ్మెల్యేల్లో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురవుతోంది. మరోవైపు అటవీశాఖ అధికారులు చట్టప్రకారం తమ పనులు చేసుకుంటూ కందకాలు, అటవీశాఖ స్థలాల సర్వేలను కొనసాగిస్తున్నారు. పరిస్థితిని పరిష్కరించని తరుణంలో గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతిఘటనలు తప్పేలా లేవు.

ఇవీ చూడండి: 'రైతును రాజును చేయడమే ప్రభుత్వ ధ్యేయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.