Badradri Ramaiah Official Website : భద్రాద్రి రామయ్య సన్నిధిలోని ఆలయంలో జరిగే అన్ని పూజలు, సేవలు ఆన్లైన్ అందుబాటులోకి వచ్చాయి. ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి సాయంత్రం వరకు జరిగే అన్ని సేవల్లో,పూజల్లో భక్తులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని.. నేరుగా పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చనని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఈ సేవలను www.bhadradritemple.telangana.gov.in వెబ్సైట్ని సందర్శించి.. భక్తలకు నచ్చిన సమయంలో కావల్సిన సేవను బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు.
Bhadradri Temple Introduce Online Services : ఆన్లైన్లో ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పించారని అన్నారు. భద్రాద్రి రామయ్య ఆలయ ఆన్లైన్ టిక్కెట్లను ఈవో ప్రారంభించారు. ఈ సేవల కోసం గత రెండు నెలలుగా ఆలయ సిబ్బందికి శిక్షణ ఇప్పించి అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఆన్లైన్లో గుడిలో జరిగే నిత్య కల్యాణం, ప్రత్యేక దర్శనం, అర్చనలు, వెండి రథ సేవ, దర్బారు సేవ వంటి పూజల్లో పాల్గొనవచ్చు అని అన్నారు. వాటితో పాటు భక్తులు ఆలయానికి సంబంధించిన అన్నదానానికి.. గోశాలకు, ఆలయ అభివృద్ధికి విరాళాలు ఇవ్వాలనుకున్న దాతలు ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చని చెప్పారు.
Online Services of Badradri Temple : భక్తులంతా జులై 4 నుంచి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. రామయ్య సేవలను నేరుగా, ఆన్లైన్ ద్వారా ఈ సేవలను వినియోగించుకొని.. స్వామివారిని దర్శించుకోవచ్చు అని అన్నారు. భద్రాద్రి టెంపుల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్ బుకింగ్స్లోకి వెళ్లి భక్తులకు కావలిసిన సేవను బుక్ చేసుకోవచ్చని వివరించారు. వెబ్సైట్లో ఏ సమయంలో ఏ పూజ జరుగుతుందో.. సేవ లేదా పూజా టికెట్ ధరలను అందుబాటులో ఉంచారు. రాబోయే కాలంలో భక్తులకి మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు.
"సీతారాముల సేవలు ప్రజలందరికి అందాలనే ఉద్దేశంతో భద్రాద్రి దేవాలయానికి కొత్త వెబ్సైట్ రూపొందించి.. ఆన్లైన్ సేవలను, పూజలను ప్రారంభించాం. రాష్ట్ర ప్రభుత్వం సాకారంతో ఈ సేవలను తొందరగా భక్తులకు తీసుకువచ్చాం. భక్తులందరు దేవస్థానం అధికార వెబ్సైట్ని ఓపెన్ చేసి ఆన్లైన్ టికెట్లని పొందవచ్చు. అధిక మొత్తంలో భక్తులకి రామయ్య సేవలు అందేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆన్లైన్ ప్రత్యేక దర్శనం, సుప్రభాత సేవ.. ఇలా అన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. భక్తులు నేరుగా టికెట్లు పొందవచ్చు. ఎవరైనా దాతలు ఉంటే ఆన్లైన్ ద్వారా అందజేసేందుకు వీలు కల్పించాం. ఈ అవకాశాన్ని భక్తులు అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను."- రమాదేవి, భద్రాద్రి ఆలయ కార్య నిర్వహణ అధికారి
ఇవీ చదవండి :