భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనుమతులు లేని శుద్ధజల ప్లాంట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొత్తగూడెం ఆర్డీఓ స్వర్ణలత ఆదేశాల మేరకు వివిధ మండలాల్లో తాహసీల్దార్లు తనిఖీలు చేపట్టారు. జూలూరుపాడు, కాకర్ల బేతాళపాడు, పాపకొల్లు గ్రామాల్లో తాహసీల్దార్ రమేష్ ప్లాంట్లను పరిశీలించారు. ఐఎస్ఐ మార్క్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వాటిని గుర్తించి సీజ్ చేశారు. అనుమతి ఉన్న ప్లాంట్లనే కొనసాగించాలని, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని తాహసీల్దార్ ఆదేశించారు.
ఇవీ చూడండి : 'విద్యార్థులారా!! ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి'