మామిడికాయల మార్కెట్‌కు రాజస్థాన్ వ్యక్తులు వచ్చారన్న విశ్వసనీయ సమాచారంతో కొత్తగూడెం ఆర్డీవో స్వర్ణలత, జిల్లా సర్వేలెన్స్ అధికారి చేతన్, తహసీల్దారు శ్రీనివాసులు అప్రమత్తమయ్యారు. మార్కెట్‌ను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఇంతదూరం ఎలా వచ్చారని వ్యాపారులను నిలదీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని, స్థానిక వ్యక్తులతోనే వ్యాపారం నిర్వహించాలని సూచించారు.
రాజస్థాన్ వ్యక్తులను అంబులెన్స్‌లో మణుగూరు క్వారంటైన్‌కు తరలించారు. అనంతరం బూరుగ్గూడెంలోని జిల్లా సరిహద్దు చెక్‌పోస్టును ఆర్డీవో స్వర్ణలత సందర్శించి రిజిస్టర్లను పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి అపరిచిత వ్యక్తులు వస్తుంటే మీరు ఏం చేస్తున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.