భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని 29 పంచాయతీలకు 3లక్షల 7 వేల 500 మొక్కలు అందించే లక్ష్యంతో అధికారులు నర్సరీలను ఏర్పాటు చేశారు. 12 వేల మొక్కల పరిమితితో 19 గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి... అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
నర్సరీలలో మొక్కలను శ్రద్ధగా పెంచే విధంగా సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. పంచాయతీలలో నర్సరీలను మండల అభివృద్ధి అధికారి వివేక్రామ్, పంచాయతీ అధికారి అరుణ్ గౌడ్, ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. టేకు, నిమ్మ, ఉసిరి, జామ, అడవి తంగేడు, బొప్పాయి మొక్కలతో పాటు పోలవరం పంచాయతీలో వినూత్నంగా దానిమ్మ, కమల మొక్కలను పెంచుతున్నారు.