భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు గాను మొత్తం 41 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నోటీసు బోర్డు మీద వివరాలు వెయ్యక ముందే వారిలో 37 మంది అభ్యర్థులను అర్హులని ఎన్నికల అధికారి పద్మరాజు ప్రకటించారు.
తెరాస పార్టీ మద్ధతుదారుల అభ్యర్థి కోసం మరో రెండు పేర్లు కలిపి 39 పేర్లను ప్రకటించారని న్యూడెమోక్రసీ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. సహకార సంఘ కార్యాలయం ముందు పోలీసుల సమక్షంలోనే ఎన్నికల అధికారితో వాగ్వాదానికి దిగారు.
తనపై ఎవరి ఒత్తిడి లేదని 39 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను నోటీసు బోర్డు వేశానని ఎన్నికల అధికారి తెలిపారు.