ETV Bharat / state

నిన్న లేఖ రాశారు... నేడు రెండు వాహనాలు కాల్చేశారు! - మావోయిస్టుల వార్తలు

రహదారి పనులు చేస్తున్న రెండు వాహనాలను మావోయిస్టులు దహనం చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బత్తినపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

naxals-have-set-ablaze-two-vehicles-in-bhadradri-kottagudem
నిన్న లేఖ రాశారు... నేడు రెండు వాహనాలు తగులబెట్టేశారు
author img

By

Published : Jul 22, 2020, 9:36 AM IST

Updated : Jul 22, 2020, 1:22 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బత్తినపల్లి గ్రామంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గ్రామంలో రహదారి పనులు చేస్తున్న రెండు వాహనాలకు నిప్పంటించారు.

naxals-have-set-ablaze-two-vehicles-in-bhadradri-kottagudem
నిప్పంటించిన మావోయిస్టులు

రోడ్డు రోలర్​, ట్రాక్టర్​ను తగులబెట్టారు. ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా మావోయిస్టు డివిజన్ కార్యదర్శి ఆజాది పేరుతో మంగళవారం లేఖలు విడుదల చేసిన మావోయిస్టులు... నేడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.

జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాలు వాడవాడలా నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. అమరుల ఆశయాల కోసం పోరాడాలని రాశారు. వీరు ఎప్పుడు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడతారోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్ ఎఫెక్ట్: ఆలుమగల మధ్య కరోనా రగిల్చిన మంటలివి!

Last Updated : Jul 22, 2020, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.