ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని రామయ్యను(bhadradri Ramayya) కోరుకున్నట్లు తెదేపా(tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) తెలిపారు. పోలవరం ముంపు మండలాల్లోని నిర్వాసితులకు పరిహారం అందేలా పోరాటం చేస్తానని పేర్కొన్నారు. వారిని పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల సర్వం కోల్పోయిన నిర్వాసితులకు శక్తిని అందించాలని రామయ్యను కోరుకున్నానని అన్నారు. మండలాల్లోని వారి పరిస్థితులను తెలుసుకుని... పరిహారం అందేలా పోరాటం చేస్తానని చెప్పారు.
పోలవరం(polavaram) ముంపు మండలాలైన కూనవరం, వీఆర్ పురం, చింతూరులో పర్యటన నేపథ్యంలో రామయ్యను(seetha rama swamy temple) దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. లోకేశ్‌తో పాటు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, తెదేపా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
ఈరోజు దేవుడిని ఒక్కటే కోరుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇంకా ఉంది. భారతదేశంలో మూడో వేవ్ అంటున్నారు. ఇది దేశ ప్రజలకు విముక్తి కలింగించాలని కోరుకున్నాను. ఆంధ్రా, తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రార్థించాను. ముంపు మండలాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారందరికీ శక్తి అందించాలని కోరుకున్నాను.
-నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇదీ చదవండి: TS High Court: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు