ETV Bharat / state

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరాస విజయదుందుభి - మున్సిపల్​ ఎన్నికల ఫలితాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పురపాలికల్లో తెరాస ఆధిపత్యం కొనసాగింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలో కూడా విజయకేతనం ఎగరేసింది.

muncipal election results in khammam and bhadradri kothagudem district
విజయదుందుభి మోగించిన తెరాస
author img

By

Published : Jan 25, 2020, 4:25 PM IST

Updated : Jan 25, 2020, 9:38 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరాస ప్రభంజనం సృష్టించింది.ఎన్నికలు జరిగిన 5 పురపాలికలకు 5 గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఖమ్మం జిల్లాలోని 3 మున్సిపాలిటీలు వైరా, మధిర, సత్తుపల్లి, భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు పురపాలికల్లో తెరాస పాగా వేసింది.

ఖమ్మం జిల్లాలో...

గత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సత్తుపల్లి పురపాలికలో అన్ని వార్డులకు అన్ని వార్డుల్లో గులాబీ జెండా ఎగురవేసిన తెరాస.. 23కు 23 వార్డులు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. సత్తుపల్లిలో అన్ని వార్డుల్లోనూ తెరాస భారీ ఆధిక్యంతో విజయం సాధించగా...ప్రతిపక్ష పార్టీలు కనీసం పోటీ కూడాఇవ్వలేకపోయాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిరలోనూ పాగా వేసిన గులాబీ పార్టీ... ఒంటరిగానే పురపీఠం కైవసం చేసుకుంది. 22 వార్డులున్న మధిరలో తెరాస 13, కాంగ్రెస్ 4, తెదేపా 3, సీపీఎం1, ఇతరులు 1 వార్డుల్లో విజయం సాధించాయి. 20 వార్డులున్న వైరా పురపాలికలో 15 వార్డులు గెలుచుకుని తెరాస అధికార పీఠాన్ని దక్కించుకోగా... ఇతర పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కాంగ్రెస్ 2, సీపీఎం 1, ఇతరులు 2 వార్డుల్లో గెలుపొందాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...

ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లోనూ తెరాస స్పష్టమైన ఆధిక్యం సంపాదించి..మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకుంది. 36 వార్డులు ఉన్న కొత్తగూడెంలో తెరాస 25 వార్డుల్లో గెలుపొందగా.. సీపీఐ 8, కాంగ్రెస్ 1, ఇతరులు 2 వార్డుల్లో గెలుపొందారు. ఇల్లెందు పురపాలికపైనా గులాబీ జెండా ఎగిరింది. మొత్తం 24 వార్డులకు గానూ 19 వార్డుల్లో తెరాస విజయ దుందుభి మోగించగా... సీపీఐ1, న్యూడెమోక్రసీ 1 గెలుపొందారు. ఇక తెరాస రెబల్స్​గా బరిలోకి దిగిన ముగ్గురు విజయం సాధించారు. వారిలో ఇద్దరు గెలుపు పత్రం తీసుకోగానే ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో తెరాసలో చేరారు. దీంతో...తెరాస ఇల్లెందు పురపాలికలో తెరాస బలం 21కి చేరింది.

జిల్లావ్యాప్తంగా సంబురాలు

ఉమ్మడి జిల్లాల్లోని 5 మున్సిపాలిటీల్లోనూ విజయదుంధుభి మోగించడంతో... జిల్లావ్యాప్తంగా తెరాస సంబరాలు అంబరాన్నంటాయి. అన్ని మున్సిపాలిటీలతోపాటు జిల్లాలోని పలుచోట్ల తెరాస నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలోమిఠాయిలు పంచుకున్నారు. నాయకులకు స్వయంగా మంత్రి అజయ్ మిఠాయిలు పంచి సంబరాల్లో పాల్గొన్నారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు సంబురాల్లో మునిగితేలారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరాస విజయదుందుభి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరాస విజయదుందుభి
muncipal election results in khammam and bhadradri kothagudem district
విజయదుందుభి మోగించిన తెరాస

ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికల్లో తెరాస హవా

Last Updated : Jan 25, 2020, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.