'మహాజన సోషలిస్టు పార్టీ సదస్సుకు భారీగా తరలిరావాలి' - telangana news
మంద కృష్ణ మాదిగ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యకుడు ప్రదీప్ గౌడ్ తెలిపారు. వరంగల్లో జరిగే ఎమ్ఎస్పీ సమావేశాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు హాజరు కావాలని సూచించారు.
'మంద కృష్ణ మాదిగ ముఖ్యమంత్రి అవ్వాలి'
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్ గౌడ్ భద్రాద్రి రామయ్యను దర్శించుకుని... ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసి... మంద కృష్ణ మాదిగ ముఖ్యమంత్రి అవ్వాలని రామయ్యను కోరుకున్నట్లు తెలిపారు.
ఈ నెలలలో వరంగల్లో జరగనున్న ఎమ్ఎస్పీ సదస్సుకు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారిని తీసుకెళ్లేందుకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.