పట్టభద్రుల ప్రయోజనాలు కాపాడుతానని... మీ ప్రతినిధిగా తెలంగాణ బిడ్డగా అవకాశం ఇవ్వాలని యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి కోరారు. ఎటువంటి ఉద్యమ నేపథ్యం లేకపోయినా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గత ఎన్నికల్లో గెలిపిస్తే ఉద్యోగ అవకాశాలు, పట్టభద్రుల సంక్షేమం కోసం ఏనాడూ మాట్లాడిన దాఖలాలు లేవని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన సమావేశంలో విమర్శించారు. నేడు ఎందరో ప్రైవేటు ఉపాధ్యాయులు వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నా ఆయన స్పందించడం లేదని వాపోయారు.
సమస్యల సాధనకు కృషి...
నిరుద్యోగ సమస్యపై మాట్లాడకపోగా కేవలం ప్రగతి భవన్‌కి, ముఖ్యమంత్రికి సేవ చేయడానికే పరిమితమయ్యారని ఆరోపించారు. ప్రొఫెసర్ కోదండరామ్ అంటే తనకు గౌరవం ఉందని, ఉద్యమ అనుభవం గల నేతగా తనలాంటి వారికి సూచనలు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారు, ఉద్యమం కోసం రోడ్ల మీద పడ్డ వారి కంటే ఎవరు గొప్ప వాళ్ళు కాదని ఉద్ఘాటించారు. ప్రతిపక్షం తీసుకురాని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని... అందరితో కలిసి సమస్యల సాధనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: భారీ మెజార్టీతో కవిత గెలుపు... విపక్షాల డిపాజిట్లు గల్లంతు...