ETV Bharat / state

రాజకీయ అంశాల ప్రాధాన్యతతోనే కేసీఆర్ పాలన : కోదండరాం

తెలంగాణ సాధించిన తరువాత రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్యలు పెరుగుతున్నప్పటికీ తెరాస ప్రభుత్వం స్పందించడంలేదని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాజకీయ అంశాల ప్రాధాన్యతతో కేసీఆర్ పాలన సాగుతోందని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జేకే సింగరేణి గ్రౌండ్​లో మార్నింగ్​ వాక్​ చేసే వారితో కలిసి ముచ్చటించారు.

Professor Kodandaram
ప్రొఫెసర్ కోదండరాం
author img

By

Published : Dec 28, 2020, 11:13 AM IST

రాష్ట్రంలో వనరులు దోచుకుని అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా... తెరాస ప్రభుత్వ పాలన సాగుతోందని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. హామీల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్​ పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఉద్యోగ ఖాళీల భర్తీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పర్యటిస్తున్న కోదండరాం.... జేకే సింగరేణి మైదానంలో ఉదయపు నడకకు వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. సమస్యల పరిష్కార సాధనకై తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయనకు సీపీఐఎంఎల్​ న్యూడెమోక్రసీ నాయకులు, వివిధ వర్గాల సంఘాలు మద్దతు ప్రకటించాయి.

ఇదీ చదవండి: విజయమే లక్ష్యంగా.. వరంగల్​, ఖమ్మంపై కేటీఆర్ దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.