భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా స్వయంగా పారిశుద్ధ్య పనులు చేశారు. ఆదర్శ నగర్లోని మోట్లవాగులో పేరుకుపోయిన వ్యర్థాలు, చెత్తను తొలగించారు. కాలువల్లో పుడికతీత పనులను పర్యవేక్షించారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
ఇవీచూడండి: అర్ధరాత్రి నుంచి ఇంటర్ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు