భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ ప్రజలకు బత్తాయి పండ్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు 200 క్వింటాళ్ల బత్తాయి పండ్లను కొనుగోలు చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్ వెళ్లిన ఎమ్మెల్యే రేగా కాంతారావు అక్కడ బత్తాయి తోటలను నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి పరిశీలించారు.
కొనుగోలు చేసిన బత్తాయి పండ్లను రేగా దగ్గరుండి లోడ్ చేయించారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు పేద ప్రజల్లో రోగ నిరోధకశక్తి పెరిగేందుకు బత్తాయి పండ్లను రేగా కాంతారావు ప్రజలకు పంపిణీ చేయనున్నారు.
ఇవీ చూడండి: 'ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేయడం ఎలా సాధ్యమవుతుంది?'