భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారులను ఆదేశించారు. భూ రికార్డుల నమోదు పట్టాల జారీపై గుడివాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల తహసిల్దార్లతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. రైతులకు సంబంధించిన భూముల పట్టాల విషయంలో ఆలస్యం చేయొద్దని రేగా అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు జారీ చేసినా పట్టాల వివరాలను అసంపూర్తిగా ఉన్న పంట వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్వో, ఎఫ్ఆర్ పట్టాల జారీకి జాబితా సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇవీ చూడండి: ఆర్థిక సర్వే 2019: వృద్ధిరేటు అంచనా 7%