ఎమ్మెల్యే హరిప్రియ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పర్యటించారు. మండలం నుంచి.. టేకులపల్లి, గార్ల, బయ్యారం, కామేపల్లి, సింగరేణి మండలాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతోన్న మోటార్లను ఆమె పరిశీలించారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నియోజకవర్గ ప్రజలకు నీటి సమస్య రాకుండా చూడాలన్నారు ఎమ్మెల్యే. నల్లాలు లేని వారిని గుర్తించి.. వారందరికీ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: రేపటి నుంచి ఎంజీఎంలో కొవిడ్ సేవలు: ఎర్రబెల్లి