భద్రాద్రి జిల్లా ఇల్లందు నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు జలాలను అందించాలని ఎమ్మెల్యే హరిప్రియ అధికారులను కోరారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కార్యదర్శి స్మిత సబర్వాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీటిపారుదల శాఖ రజత్ కుమార్, నీటి పారుదల శాఖ ప్రభుత్వ సలహా దారులు పెంటారెడ్డి, సీతారామ ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు ప్రాజెక్ట్‌పై సమీక్షించారు. భద్రాద్రి జిల్లాలోని బీజీ కొత్తూరు, వీకే రామారం పంప్ హౌస్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి హరిప్రియ హాజరయ్యారు.
మణుగూరులోని గెస్ట్ హౌస్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులను కలుసుకొని సీతారామ జలాల విషయంలో ఇల్లందుకు జరుగుతున్న నష్టాన్ని గురించి ఎమ్మెల్యే హరిప్రియ వివరించారు. స్పందించిన అధికారులు ఇల్లందు నియోజకవర్గానికి నీరు చేరేందుకు గల మార్గాలు, ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సూచించారు.
ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్