భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ శిలాఫలకాలు వేసిన నాలుగు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే హరిప్రియ భూమిపూజ చేశారు. రూ.కోటి 50 లక్షలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, రూ. కోటి 30 లక్షలతో మల్టీ యుటిలిటీ సెంటర్, రూ. కోటి ఇరవై లక్షలతో పార్క్ పనులు చేపట్టనున్నారు.
త్వరలోనే ఇల్లందు బస్ డిపో కూడా ఏర్పాటవుతుందని ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. అభివృద్ధే లక్ష్యంగా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.
అనంతరం మంత్రి హరీశ్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెరాస నాయకులు కేక్ కట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు అందించారు.