భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని పలు పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు. మండలంలోని పలువురు లబ్ధిదారులకు రూ. 6 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఆర్‌ఆర్ కాలనీలో ఏర్పాటైన మూడు ఎకరాల విస్తీర్ణంలోని చిట్టడివిని పరిశీలించారు. తక్కువ సమయంలో 12వేల మొక్కలను పురపాలక ప్రజా ప్రతినిధులు, సిబ్బంది ఏర్పాటుచేయడం పట్ల అభినందించారు.
ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే హరిప్రియ...
ఇల్లందులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓపెన్ జిమ్ వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే హరిప్రియ స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, ఇతర ప్రజా ప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: HIGH COURT: పెద్దలే కరోనా నిబంధనలు పాటించట్లే... పిల్లలు పాటిస్తారా?