ETV Bharat / state

ముస్లిం సోదరులకు కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - పేద ముస్లింలకు దుస్తుల పంపిణీ

రంజాన్​ను పురస్కరించుకుని.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియ ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని వారికి సూచించారు.

ramadan gifts to muslims i
ramadan gifts to muslims i
author img

By

Published : Apr 30, 2021, 3:16 PM IST

కొవిడ్ బాధలు తొలిగిపోయేలా ప్రార్థన చేయాలంటూ ఎమ్మెల్యే హరిప్రియ.. ముస్లిం సోదరులను కోరారు. ప్రభుత్వ నియమాలను పాటిస్తూ రంజాన్​ వేడుకలను జరుపుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఇల్లందు క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం తరఫున పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.

కరోనా కారణంగా.. ఈ ఏడాది ఇఫ్తార్ విందు జరుపుకోలేకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న మహమ్మారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.