భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరపాడు మండలంలో రెండో విడత పల్లె ప్రగతి తొలిరోజే ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. గుండెపుడిలో త్రాగునీటి సమస్య పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యే రాములునాయక్ కాన్వాయ్‌ను గ్రామస్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఆ గ్రామంలో మొక్కలు నాటేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డగించి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. దీంతో ఎమ్మెల్యే రాములునాయక్ కారు దిగి వారితో మాట్లాడారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, చేతిపంపుల్లో నీరు ఎర్రగా కలుషితంగా ఉంటున్నాయని వారు ఎమ్మెల్యేకు తెలిపారు.
ఇవీ చూడండి: సమాజంలో నేర ప్రవృత్తి ఆపేందుకు పాఠ్యాంశాలు