భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిషన్ భగీరథ పైప్లైన్ లీక్ అయ్యింది. పాల్వంచ సమీపంలోని నవభారత్ వద్ద పైపు పగిలిపోవడంతో నీరు ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది. నీరు ఆకాశానికి ఎగజిమ్మిన దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు భారీగా రోడ్డు పైకి వచ్చారు.
జాతీయ రహదారి పక్కనే ఈ పైప్ లైన్ లీక్ కావడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని గమనించిన అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు.