ETV Bharat / state

టిక్​టాక్​తో ఇల్లు చేరిన తండ్రి.. కుటుంబంలో పండగ - టిక్​టాక్

రెండేళ్ల క్రితం తప్పిపోయిన తండ్రిని టిక్​టాక్ ద్వారా కనుగొని ఇంటికి తీసుకువచ్చిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

పంజాబ్ నుంచి బూర్గంపాడు చేరిన తప్పిపోయిన తండ్రి

author img

By

Published : May 27, 2020, 5:51 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం పినపాక పార్టీ నగర్ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకి భార్య ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటేశ్వర్లు మూగ కావడం వల్ల 2018 ఏప్రిల్ నెలలో పనికి వెళ్తానని చెప్పి అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడం వల్ల కుటుంబసభ్యులు చివరికి బూర్గంపాడు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

గ్రామస్థుడి సహాకారంతో...

వారం రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన నాగేంద్రప్రసాద్ అనే యువకుడు టిక్​టాక్​లో.. పంజాబ్​ లూథియానాలో లాక్​డౌన్ సందర్భంగా అక్కడి పోలీసులు భిక్షాటన చేస్తున్న వెంకటేశ్వర్లుకు భోజనం పెడుతున్న వీడియోను చూశాడు. టిక్​టాక్ చూసిన నాగేంద్ర ప్రసాద్... బాధిత కుటుంబానికి ఈ విషయాన్ని తెలియజేశాడు.

తండ్రి కోసం లూథియానాకు కుమారుడు..!

వెంటనే కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించి హైదరాబాద్​లోని ఐఐఎల్ మేనేజ్​మెంట్ సహకారంతో లూథియానాకు చేరుకున్నారు. బాధితుడి కుమారుడు పెద్దిరాజు తండ్రిని గుర్తించి గ్రామానికి తీసుకువచ్చాడు. రెండేళ్ల తర్వాత తమ తండ్రి ఇంటికి తిరిగి రావడం ఆ ఇంట్లో పండగ వాతావరణం నింపింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వెంకటేశ్వర్లు కుమారుడు పెద్దిరాజును హోమ్ క్వారంటైన్​లో ఉంచారు.

ఇవీ చూడండి : సినిమాటోగ్రాఫర్​ శ్యామ్​కె నాయుడిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.