bhadradri temple: భద్రాద్రిలో సీతారాముల కల్యాణ శుభ ఘడియలు దగ్గరపడుతున్న వేళ అందుకు సంబంధించిన ఏర్పాట్లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. ఈనెల 10న జరగనున్న సీతారాముల కల్యాణ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రెండేళ్ల తరువాత నిర్వహించే కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
"భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది.మిథిలా స్టేడియంలో జరుగుతున్న పనులను పరిశీలించాను. కరోనా కారణాల వల్ల రెండు సంవత్సరాలు కల్యాణాన్ని కొద్దిమంది సమక్షంలోనే నిర్వహించాము. ఈ సంవత్సరం కొవిడ్ ఆంక్షలు లేవు కావున భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. వారందరికి అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తాం." - పువ్వాడ అజయ్ కుమార్ రవాణా శాఖ మంత్రి
- ఇదీ చదవండి: భద్రాద్రి తిరువీధుల్లో ఊరేగిన స్వామివారు