ఇల్లందు పట్టణ సమస్యలపై మంత్రుల బృందంతో ముఖ్యమంత్రిని కలుస్తామని కేటీఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటన ముగించుకొని భద్రాద్రి జిల్లా ఇల్లందుకు వచ్చిన కేటీఆర్‌కు ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియనాయక్, శంకర్‌నాయక్, ఇతర నేతలు స్వాగతం పలికారు.
పట్టణంలోని మల్టీ యుటిలిటీ సెంటర్, పార్క్, మార్కెట్ నిర్మాణాల శిలా ఫలకాలను ఆవిష్కరించారు. పురపాలక ఎన్నికలకు ముందు ఇల్లందు పట్టణాన్ని కేటీఆర్ దత్తత తీసుకుంటారని స్థానిక నేతలు ప్రకటించినా.. ప్రసంగంలో దత్తత అంశంపై కేటీఆర్ ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఇవీచూడండి: కేటీఆర్ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం