భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 2018 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ప్రారంభించిన మినీ ట్యాంక్ బండ్ పనులు రెండు సంవత్సరాలు గడిచినా పూర్తి కాలేదు. సుమారు 3కోట్ల వ్యయంతో ప్రారంభమైన అభివృద్ధి పనులు, నత్తనడక నిర్మాణాలతో అసంపూర్తిగా మిగిలాయి.
ఇల్లందులో పాడు చెరువు కట్ట వద్ద 930 మీటర్ల పొడవు 7 మీటర్ల వెడల్పుతో ప్రారంభించిన పనులు 65 శాతం పూర్తి కాగా... మిగితా పనులలో ఎటువంటి పురోగతి లేదు. ఇరిగేషన్ డీఈ 65 శాతం పనులకు బిల్లులు పంపగా... ఇప్పటివరకు ఎటువంటి చెల్లింపులు గుత్తేదారులకు అందలేదు. ఆగస్టు 2020 నాటికి ఈ పనులు పూర్తి కావాల్సి ఉండగా... కొవిడ్ ప్రభావం, లాక్డౌన్ వంటి కారణాలతో గుత్తేదారులు పనులు ఆలస్యం చేసినట్లు డీఈ తెలిపారు. ఈ మేరకు నోటిసులివ్వగా... 2021 జూన్ నాటి పనులు పూర్తి చేస్తామని గుత్తేదారులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: వరదసాయంలో గోల్మాల్.. అందలేదంటున్న లబ్ధిదారులు