లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంత రాష్ట్రమైన ఒడిశాకు వలస కార్మికులు బయలుదేరారు. సుమారు 370 కిలోమీటర్లు నడిచి భద్రాచలం చేరుకున్నాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తెల్లవారుజామున మృతి చెందాడు. వలస కార్మికుని బంధువులు అతనిని ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు వెల్లడించారు.
కరోనా నేపథ్యంలో ఎలాంటి వివరాలు నమోదు చేయలేదని... పోస్టుమార్టం సైతం చేయలేదని భద్రాచలం ఆస్పత్రి సూపరిండింటెంట్ యుగంధర్ వెల్లడించారు. మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో పంపించినట్లు తెలిపారు. అక్కడి పోలీసులకు వివరాలు అందించామన్నారు.
ఇవీ చూడండి: 'వలస కూలీల కోసం రోజుకు 100 రైళ్లు నడపాలి'