భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియాలోని గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వయసున్న ఉద్యోగులందరికీ టీకాలు ఇస్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఈ మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొని అర్హులందరూ టీకాలు తీసుకోవాలని జీఎమ్ మల్లెల సుబ్బారావు తెలిపారు.
ఇల్లందు ఏరియా ప్రధాన ఆసుపత్రి, సి.ఇ.ఆర్ క్లబ్ సింగరేణి ఉన్నత పాఠశాల, జేకే కాలనీ, టేకులపల్లిలోని సింగరేణి కాలనీ సి.ఇ.ఆర్ క్లబ్‌లలో వ్యాక్సిన్ కేంద్రాలను ప్రారంభించారు. టీకాలు తీసుకునేందుకు వచ్చే వారంతా మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని జీఎమ్ మల్లెల సుబ్బారావు సూచించారు.
ఇదీ చూడండి: CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ