భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యంపులో స్వతహాగా వైద్యుడైన ఏఎస్పీ శబరీష్ వైద్యసేవలు అందించారు. వైద్యం కోసం వివిధ గ్రామాల నుంచి వచ్చిన రోగులను పరీక్షించి పలు సూచనలు చేశారు.
ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: భద్రాచలంలో కోలాటం, నృత్య పోటీలు