తెలంగాణ - చత్తీస్ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టులు గురువారం అలజడి సృష్టించారు. చత్తీస్‌ఘడ్‌లోని నారాయణపూర్ జిల్లాలో ఎరకబట్టి వద్ద నిర్మాణపనుల కోసం వాడుతున్న మూడు ట్రాక్టర్లను తగలబెట్టారు. పనులు జరిగే ప్రాంతానికి వచ్చి అక్కడివారిని బెదిరించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పామేడు, తిప్పాపురం గ్రామాల రహదారిల్లోనూ మావోల బ్యానర్లు వెలిశాయి. కార్పొరేట్ శక్తుల కోసమే రహదారులు నిర్మిస్తున్నారని, సరిహద్దు గ్రామాల్లో నిర్వహించే వారపు సంతను నిలిపివేసి ఆదివాసీలకు ఇబ్బంది కలిగిస్తున్నారని అందులో ఆరోపించారు. అధికారులు ఇలాంటి చర్యలే కొనసాగిస్తే ఆదివాసీలు తిరుగుబాటు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇవీ చూడండి: ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం