Maoist disrupt Road works: ఛత్తీస్ గఢ్లో మావోయిస్టుల దుశ్చర్యలు ఆగడం లేదు. ఇటీవల రోడ్డు పనులు చేస్తుండగా.. 12 వాహనాలకు నిప్పుపెట్టిన మావోయిస్టులు.. మళ్లీ అలాంటి ఘటననే పునరావృతం చేశారు. కాంకేర్ జిల్లా మారాపి- కల్ముచే రహదారిపై రోడ్డు నిర్మాణంలో పనిచేస్తున్న 1 జేసీబీ, 2 టిప్పర్లు, 2 మిక్సర్ మిషన్లకు నిప్పుపెట్టారు. కంకేర్ జిల్లా కేంద్రం నుంచి 20 కి.మీ దూరంలో ఈ ఘటన జరిగింది. నిప్పు పెట్టిన అనంతరం సంఘటనా స్థలం వద్ద బ్యానర్లు, పోస్టర్లను మావోయిస్టులు వదిలి వెళ్లారు. "రోడ్డు నిర్మాణానికి మరణశిక్ష" అని పోస్టర్లలో రాశారు.
సిబ్బందిని కొట్టి
15 రోజుల క్రితం బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో 12 వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టారు. బామ్రా గఢ్ ప్రాంతంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద దోదరాజ్ నుంచి కవండే వరకు రోడ్లు వేస్తుండగా ఈ ఘటనకు పాల్పడినట్లుగా సమాచారం. రోడ్డు నిర్మాణం పూర్తయితే వారి ఉనికి ప్రమాదమని భావించి... వాహనాలను తగలబెట్టినట్లు తెలుస్తోంది. ఆయుధాలతో నిర్మాణ ప్రదేశం వద్దకు వచ్చిన మావోయిస్టులు... రహదారి పనులు చేస్తున్న సిబ్బందిని చితకబాది... 9 ట్రాక్టర్లు, రెండు జేసీబీలు, డోజర్లను తగులబెట్టారు.
ఇదీ చదవండి: KTR Tweet Today : కేటీఆర్‌కు పర్యావరణవేత్త ట్వీట్.. మంత్రి రియాక్షన్ అదుర్స్