ETV Bharat / state

వైమానిక దాడులకు సంబంధించి ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టులు - పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు

ఈ నెల 11న ఛత్తీస్​గఢ్​ దండకారణ్యంలో పోలీసులు జరిపిన వైమానిక దాడుల్లో మహిళా మావోయిస్టు మృతి చెందారని మావోయిస్టులు తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి లేఖను విడుదల చేసిన మావోయిస్టులు.. తాజాగా ఫొటోలను విడుదల చేశారు.

Airstrikes in Chhattisgarh forest
Airstrikes in Chhattisgarh forest
author img

By

Published : Jan 13, 2023, 10:29 PM IST

మావోయిస్టులు విడుదల చేసిన ఫొటోలు
మావోయిస్టులు విడుదల చేసిన ఫొటోలు

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో వైమానిక దాడులు జరిగాయని పేర్కొంటూ మావోయిస్టులు తాజాగా ఫొటోలు విడుదల చేశారు. పోలీసులు జరిపిన వైమానిక దాడుల్లో మహిళా మావోయిస్టు మృతి చెందారని తెలిపారు. దక్షిణ బస్తర్‌ అటవీ ప్రాంతంలోని కొండలపై ఈ నెల 11న వైమానిక దాడులు జరిగాయని, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారని పేర్కొన్నారు.

మావోయిస్టులు విడుదల చేసిన ఫొటోలు
మావోయిస్టులు విడుదల చేసిన ఫొటోలు

ఎన్‌కౌంటర్‌ ఘటనకు సంబంధించి నిన్న మావోయిస్టులు లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్‌ సంతోశ్ చనిపోలేదని అందులో పేర్కొన్నారు. ఆయన చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. హిడ్మా కోసం కొంతకాలంగా ఛత్తీస్‌గఢ్‌ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్‌ కోబ్రా బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్‌ బలగాలు విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. నాలుగు నెలల కిందట సైతం భద్రతా బలగాల ఆపరేషన్‌ నుంచి హిడ్మా తప్పించుకున్నాడు.

మావోయిస్టులు విడుదల చేసిన ఫొటోలు
మావోయిస్టులు విడుదల చేసిన ఫొటోలు

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ-ఒడిశా సరిహద్దుల్లో హిడ్మా తన అనుచరులతో మకాం వేసినట్లు బలగాలకు తాజాగా సమాచారం అందడంతో బీజాపూర్‌- సుక్మా సరిహద్దులో ధరేలీ-కామరతోగు మధ్య కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ సమయంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని.. ఈ ఘటనలో గాయపడిన భద్రతా బలగాలను తీసుకువచ్చేందుకు వెళ్లిన హెలికాప్టర్‌పై మావోయిస్టులు కాల్పులు జరిపారని.. ఈ ఘటనలోనే హిడ్మా మృతిచెందినట్లు పెద్దఎత్తున ప్రచారం సాగింది.

మావోయిస్టులు విడుదల చేసిన ఫొటోలు
మావోయిస్టులు విడుదల చేసిన ఫొటోలు

అసలు ఏం జరిగిందంటే.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ అడవుల్లో బుధవారం సీఆర్‌పీఎఫ్‌ దళాలు కూబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురు పడటంతో భారీ ఎన్‌కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)కి కమాండర్‌గా ఉన్న హిడ్మా సహా పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం అందింది. దీనిపై పోలీసులు కానీ, మావోయిస్టు పార్టీ కానీ నిన్న అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఎన్‌కౌంటర్‌ వార్తలపై బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ స్పందించారు. భద్రతాదళాల సభ్యులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. సవివరమైన సమాచారం త్వరలో తెలియజేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే నేడు మావోయిస్టులు కీలక లేఖ విడుదల చేశారు.

అసలు ఎవరీ హిడ్మా..? పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)కి హిడ్మా కమాండర్‌గా ఉన్నారు. ఈ దళంలోని సభ్యులు అత్యాధునిక ఆటోమేటిక్‌ ఆయుధాలను వినియోగిస్తారు. దళాలపై దాడులు చేశాక.. అపహరించిన అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లను ఈ బెటాలియన్‌ ఎక్కువగా వాడుతుంటుంది. వీరు పూర్తిగా యూనిఫామ్‌లో ఉంటారని పేరు. హిడ్మా నేతృత్వంలో జరిగే దాడుల్లో భద్రతా దళాలకు జరిగే నష్టంతో పోలిస్తే మావోల వైపు 10 శాతం కంటే తక్కువ ప్రాణ నష్టం ఉంటుందనే పేరుంది. అందుకే గతంలో సుక్మా సమీపంలో జరిగిన దాడుల్లో భద్రతా దళాలు భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూశాయి. అందుకే అతడు అత్యంత వేగంగా మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా స్థానం దక్కించుకొన్నాడు. సాధారణంగా ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల వారు అత్యధికంగా ఉంటారు. కానీ, సుక్మా నుంచి ఈ స్థానంలోకి వెళ్లిన తొలి వ్యక్తి హిడ్మా.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.