maoist militias' surrendered: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్ స్టేషన్లో ఎస్పీ సునీల్ దత్ ఎదుట ఒక మావోయిస్టు సభ్యురాలు, ఏడుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. ఛత్తీస్గడ్కు చెందిన దళ సభ్యురాలితో పాటు చర్ల మండలానికి చెందిన ఏడుగురు మిలిషియా సభ్యులు లొంగి పోయినట్లు ఎస్పీ సునీల్ తెలిపారు. వీరంతా మావోయిస్టు పార్టీలో తిరుగుతున్న క్రమంలో వారు చేపట్టే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు విసుగుచెంది అందులో నుంచి బయటపడినట్లు తెలిపారు.
ప్రజల్లో మావోయిస్టులపై ఆదరణ లేదని, వారు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఎస్పీ వెల్లడించారు. మిగతా మావోయిస్టులంతా ప్రజా సంఘాల ద్వారా లేదా పోలీసుల ద్వారా గాని లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.
ఇదీ చదవండి: CM Kcr Yadadri Tour: నేను చనిపోయినా సరే.. విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోను: కేసీఆర్