![ఆర్కే మృతదేహం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13371666_rk1.jpg)
ఆర్కే(RK) అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ(Maoist party) విడుదల చేసింది. తెలంగాణ సరిహద్దు పామేడు-కొండపల్లి ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు (funerals) నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు మావోయిస్టులు భారీగా హాజరయ్యారు. మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేసినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఆర్కే మృతదేహంపై ఎర్రజెండా ఉంచి మావోయిస్టులు నివాళులు(tribute) అర్పించారు.
![ఆర్కే అంత్యక్రియలకు హాజరైన మావోయిస్టులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13371666_rk-2.jpg)
అనారోగ్యంతో కన్నుమూత..
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే (60) ఈనెల 14న అనారోగ్యంతో కన్నుమూశారు. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన ఆయన తీవ్రమైన మధుమేహం, కీళ్ల నొప్పులు, కిడ్నీ వ్యాధితో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో గురువారం మృతి చెందారు. మూడేళ్లుగా ఆయన ఎముకల క్యాన్సర్‌తోనూ బాధపడుతున్నట్లు సమాచారం. ఆర్కే మరణాన్ని పోలీసులు ధ్రువీకరించారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న ఆయన ఆంధ్ర ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఇన్‌ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. 38 ఏళ్ల క్రితం ఉద్యమంలోకి వెళ్లిన ఆర్కే 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలకు ఆంధ్ర రాష్ట్ర కమిటీ ప్రతినిధిగా హాజరయ్యారు. 2004 అక్టోబరు 15, 16, 17 తేదీల్లో చర్చలు జరిగాయి. ఆ ఘట్టం మొదలై శుక్రవారానికి సరిగ్గా 17 ఏళ్లు. సాకేత్, శ్రీనివాసరావు, ఎస్వీ, సంతోష్, గోపాల్, పంతులు ఆయన మారుపేర్లు.
![అంత్యక్రియలకు హాజరైన మావోయిస్టులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13371666_rk-3.jpg)
![ఆర్కే మృతదేహానికి నివాళులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13371666_rk-5.jpg)
సంబంధిత కథనాలు:
- Senior Maoist Leader RK: 'చదివే రోజుల్లోనే సామాజిక సమస్యలపై నిరసన గళం'
- Maoist Leader RK Death Confirm: ఆర్కే మృతిపై మావోయిస్టు పార్టీ క్లారిటీ.. ఎప్పుడు చనిపోయారంటే
- Maoist Rk Family:'ఆర్కేది ప్రభుత్వ హత్యే... మృతదేహాన్ని మాకు అప్పగించండి'
- Maoist leader rk passed away: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి.. ధ్రువీకరించిన పోలీసులు
- maoist leader rk died: మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత