కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుండా మల్లేశ్ మద్దతు తెలిపారు. ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని మందకృష్ణ విమర్శించారు. సెల్ఫ్ డిస్మిస్ అంటూ ఎక్కడలేని పదాన్ని వాడి కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్మిక లోకానికి తామంత అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: ధన త్రయోదశి రోజు ఇలా చేస్తే... లక్ష్మీ కటాక్షం మీ సొంతం!