ETV Bharat / state

రైతుల దీక్షకు మద్దతుగా ఇల్లందులో మానవహారం - ఇల్లందులో మానవహారం

దిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా ఇల్లందులో అఖిలపక్ష, రైతు సంఘాల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అన్నదాతల దీక్షలు వందో రోజుకు చేరడంతో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మానవహారంలో పాల్గొన్నారు.

manava haram
ఇల్లందులో మానవహారం
author img

By

Published : Mar 6, 2021, 5:54 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అఖిలపక్ష, రైతు సంఘాల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. దిల్లీలో రైతులు చేస్తున్న దీక్షలు 100వ రోజుకు చేరడంతో ఈ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తూ మానవహారంలో పాల్గొన్నారు.

రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు సాధినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. రైతు సంఘాల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుండా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. మానవహారంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'తెరాస నిర్లక్ష్యం వల్లే రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఆలస్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.