ETV Bharat / state

‘ఎరువుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలి’ - భద్రాద్రి కొత్తగూడెం

రైతులకు ఎరువులు అమ్మే విక్రయ కేంద్రాల వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ దురిశెట్టి అనుదీప్​ అన్నారు. ఎరువుల విక్రయాల నిబంధనలపై రూపొందించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు.

Kothagudem Collector Released Wallposter
‘ఎరువుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలి’
author img

By

Published : Aug 25, 2020, 1:30 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని డీఆర్​డీవో కార్యాలయంలో ఎరువుల విక్రయాల నిబంధనలపై రూపొందించిన గోడ పత్రికను జిల్లా అదనపు కలెక్టర్ ​దురిశెట్టి అనుదీప్​ ఆవిష్కరించారు. రైతులకు ఎరువులు విక్రయించే వ్యాపారులు ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు విధిగా పాటించాలని సూచించారు. ఎరువులు అమ్మే సమయంలో రైతులను ఎలాంటి ప్రలోభాలకు, మోసానికి గురి చేయవద్దని హెచ్చరించారు. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి అమ్మకాలు, కొనుగోళ్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి అభిమన్యుడు, ఉద్యానశాఖ అధికారి మరియన్న, ఏవోలు, విస్తరణాధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్​దీప్​సింగ్​ పూరీతో భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.