ETV Bharat / state

కుటుంబానికి రూ.పది వేలు..పునరావాస శిబిరాల్లోని బాధితులకు బాసట - కేసీఆర్ తాజా వార్తలు

రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి వరద ముంపు సమస్య లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. నిరాశ్రయులైన కుటుంబాలకు 20 కిలోల చొప్పున బియ్యం..రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు. ముంపు సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.1000 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

కేసీఆర్‌
కేసీఆర్‌
author img

By

Published : Jul 18, 2022, 5:16 AM IST

Updated : Jul 18, 2022, 5:36 AM IST

రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి వరద ముంపు సమస్య లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలే చేపట్టాయన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో నిరాశ్రయులై పునరావాస శిబిరాల్లో చేరిన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం, 20 కిలోల చొప్పున బియ్యం ఇస్తామని చెప్పారు.

భద్రాచలం ప్రాంతంలో ముంపు బాధితులకు 3 వేల ఇళ్ల నిర్మాణంతో సహా సీతారాముల దేవస్థానం చుట్టూ కరకట్ట అభివృద్ధికి, బూర్గంపాడు వైపు కరకట్ట మరమ్మతు, ముంపు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వరద పరిస్థితులపై భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడే విధంగా ప్రత్యేకంగా ఒక బుక్‌లెట్‌ను తయారు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం భద్రాచలంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో, ములుగు జిల్లా ఏటూరునాగారం పర్యటన తర్వాత మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షలోనూ సీఎం మాట్లాడారు.

..

నాలుగు జిల్లాలకు రూ.8.30 కోట్లు

‘‘తక్షణ సహాయం కింద ములుగు జిల్లాకు రూ.2.50 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ.2.30 కోట్లు, భూపాలపల్లి జిల్లాకు రూ.2 కోట్లు, మహబూబాబాద్‌ జిల్లాకు రూ.1.50 కోట్లు మంజూరు చేస్తున్నాం. వరద ముప్పు తొలగిపోయే వరకు ములుగు, భద్రాచలంలలో ఒక్కొక్కటి చొప్పున హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచుతాం. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పాత వంతెనలు, కాజ్‌ వేలు, కల్వర్టులకు వెంటనే మరమ్మతులు చేపడతాం. అనూహ్యంగా భారీ వర్షాలు వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను అభినందిస్తున్నా. ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను దశలవారీగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. పునరావాస కేంద్రాలను మరికొన్ని రోజులు కొనసాగించాలి. మిషన్‌ భగీరథ పైపులు చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. వాటికి తక్షణమే మరమ్మతులు చేయాలి. కరెంటు సౌకర్యాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి.

..

మరోసారి భద్రాచలం వస్తా: వరదలొచ్చిన ప్రతిసారీ భద్రాచలం మునగడం బాధాకరం. ఇక్కడి ప్రజల కష్టాలు తీరేలా శాశ్వత ప్రాతిపదికన నివాసాల కోసం కాలనీలు నిర్మిస్తాం. భద్రాద్రి రాములవారి ఆలయం, పర్ణశాల ముంపునకు గురికాకుండా చర్యలు చేపడతాం. ఇందుకోసం త్వరలోనే మరోసారి భద్రాచలంలో పర్యటిస్తా. వరద ముప్పు తొలగిన అనంతరం ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు.

భగవంతుడి దయ వల్లే ఆ ప్రాజెక్టు బతికింది..

గోదావరికి 1986లో భారీ వరదలు వచ్చాయి. మారిన పరిస్థితుల కారణంగా మళ్లీ అలాంటి వరదలు వచ్చే అవకాశం ఉంది. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా కడెం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చింది. గతంలో ఎన్నడూ రెండున్నర లక్షల క్యూసెక్కులు దాటలేదు. ఈ సారి 5 లక్షల క్యూసెక్కులు దాటింది. నిజంగా చెప్పాలంటే భగవంతుడి దయవల్లే ఆ ప్రాజెక్టు బతికింది.

నిధుల కొరత లేదు: వరద ప్రాంతాల్లో పనులు చేసేందుకు ఎలాంటి నిధుల కొరత లేదు. ఎంత వ్యయం అయినా సరే నాణ్యమైన పనులు చేపట్టాలి. ఏజెన్సీ ఏరియాలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి. అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణమే చర్యలు చేపట్టాలి. అటవీ అధికారులు పనులు ఆపి ఇబ్బందులు పెట్టవద్దు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. 29వ తేదీ వరకు ఇదే పద్ధతిలో వర్షం ఉంటుంది. మరో మూడు నెలలు అందరం అప్రమత్తంగా ఉండాలి’’ అని సీఎం పేర్కొన్నారు. ఏటూరునాగారంలో సమీక్ష ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ రోడ్డు మార్గంలో వరంగల్‌కు వెళ్లారు. రాత్రి కెప్టెన్‌ లక్ష్మికాంతరావు ఇంట్లో బస చేశారు. సోమవారం సీఎం కేసీఆర్‌ ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం, ఇతర ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు.

క్లౌడ్‌ బరస్ట్‌కు విదేశీ కుట్ర!

క్లౌడ్‌ బరస్ట్‌ అనే కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని వెనుక ఏవో కుట్రలున్నాయని చెబుతున్నారు. ఎంత వరకు కరెక్టో తెలియదు. ఇతర దేశాల వాళ్లు కావాలనే మన దేశంలో అక్కడక్కడా క్లౌడ్‌బరస్ట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒకసారి కశ్మీర్‌ దగ్గర లద్దాఖ్‌లో, లేహ్‌లో ఇలా చేశారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లో చేశారు. ఈ మధ్య గోదావరి పరీవాహక ప్రాంతంపైనా చేస్తున్నట్లు మనకు చూచాయగా సమాచారం ఉంది.-సీఎం కేసీఆర్‌

ఇవీ చదవండి: 'భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర'.. సీఎం కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు

ఆర్​సీ 15.. పవర్​ఫుల్​గా రామ్​చరణ్​.. వైరల్​గా మారిన వీడియో

Last Updated : Jul 18, 2022, 5:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.