సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తహసీల్దార్ కార్యాలయంలో 52 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల్ని ఆయన పంపిణీ చేశారు. ఈ పథకాల ద్వారా సీఎం కేసీఆర్ ప్రతి పేదింటికి పెద్దన్న అయ్యారని కొనియాడారు. సంక్షేమ కార్యక్రమాల అమలుతో రాష్ట్రంలో ప్రతి ఇల్లు సంతోషంగా ఉందన్నారు.
పథకాల అమలులో తెలంగాణ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, ప్రతి ఒక్కరూ గర్వపడేలా కేసీఆర్ పాలన కొనగిస్తున్నారని వెల్లడించారు.
ఇదీ చదవండి: తొలి చిత్రంతోనే 'నంది' గెలుచుకున్న నటి ఈమె