ETV Bharat / state

అలుగు పొలుసులను విక్రయిస్తున్న అంతర్​రాష్ట్ర ముఠా అరెస్ట్​ - అలుగు పొలుసులను విక్రయిస్తున్న అంతర్​రాష్ట్ర ముఠా అరెస్ట్​

అలుగు జంతువు పొలుసులను విక్రయిస్తున్న అంతర్​రాష్ట్ర ముఠాను అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. ​ఈ ముఠాలో ఇంకా ముగ్గురు పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు.

interstate-gang-arrested-for-selling-pangolins-scales
అలుగు పొలుసులను విక్రయిస్తున్న అంతర్​రాష్ట్ర ముఠా అరెస్ట్​
author img

By

Published : Aug 3, 2020, 10:12 PM IST

అలుగు జంతువు పొలుసులను విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. జాతీయ, అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లలో అత్యంత డిమాండ్ ఉందనే కారణంతో వాటిని అక్రమంగా సేకరించి అమ్మకానికి పెట్టారు.

భద్రాచలం అటవీ ప్రాంతంలో గిరిజనులకు కొద్ది మొత్తం ఆశ చూపి, ఈ ముఠా చర్మాలను సేకరిస్తోంది. ముందుగా సమాచారం అందుకున్న కొత్తగూడెం అటవీ అధికారులు బాదావత్ రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను ఇచ్చిన సమాచారంతో మూడు రోజుల పాటు హైదరాబాద్​తో సహ వివిధ ప్రాంతాల్లో అటవీ అధికారులు నిఘా పెట్టి సునీల్, నాగరాజులతో పాటు మరో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని అటవీ, వన్యప్రాణుల సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టారు. ఈ ముఠాలో ఇంకా ముగ్గురు పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు.

అలుగు పొలుసులను వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. దీంతో వాటి పొలుసులకు బ్లాక్ మార్కెట్​లో విపరీత డిమాండ్ ఉంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో వీటిని ఒక్కో కేజీకి రూక్షల్లో ధర పలుకుతున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. చైనా సాంప్రదాయ ఔషధాల తయారీలో పోలుసులు వాడడం వల్ల... భారతదేశం నుంచి రోడ్డు మార్గం ద్వారా బీహార్, నేపాల్, మణిపూర్, బర్మా రూట్లలో చైనాకు ఇవి ఎగుమతి అయ్యే అవకాశముందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత ముఠా నుంచి సుమారు నాలుగు కేజీల పొలుసులను అటవీ శాఖ స్వాధీనం చేసుకుంది. ఇందుకోసం మూడు నుంచి ఐదు జంతువులను దమ్మపేట అటవీ ప్రాంతంలో చంపి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసుల సహకారంతో కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు నిందితులను ప్రవేశ పెట్టి, రిమాండ్​కు తరలించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.