ETV Bharat / state

చర్చకు తెరలేపిన గుర్తు తెలియని ఓట్లు

ఓ ఇంటి నంబర్ పై గుర్తు తెలియని వ్యక్తుల ఓట్లు రావడం కొత్తగూడెం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. దొంగ ఓట్లు నమోదు చేశారేమో అనే సందేహాన్ని గ్రామస్థులు వ్యక్త పరిచారు.

In the town of Kottagudem, the district headquarters of Bhadradri Kottagudem, the arrival of unidentified persons voting on a house number has opened the door for discussion.
చర్చకు తెరలేపిన గుర్తు తెలియని ఓట్లు
author img

By

Published : Mar 9, 2021, 2:18 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో ఒక ఇంటి నంబర్ పై గుర్తు తెలియని వ్యక్తుల ఓట్లు రావడం చర్చకు తెర తీసింది. ఈ నెల 14న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో... ఓట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఓటరు స్లిప్​లను రెవిన్యూ సిబ్బంది అందిస్తోంది.

ఈ క్రమంలో పట్టణంలోని రైటర్ బస్తీకి చెందిన 15 వార్డులో 8 -3- 19 నెంబర్ గల ఇంటికి 20 ఓట్లు వచ్చాయి. దీంతో ఇంటి యజమానులు అవాక్కయ్యారు. అందులో 3 ఓట్లు మినహా మిగిలిన ఓట్లు ఆ ఇంటి కి సంబంధించినవి కావని వారు తెలిపారు. తమ ఇంటి నుంచి నలుగురు ఓటరు నమోదు చేసుకోగా కేవలం ముగ్గురికి మాత్రమే ఓటు హక్కు లభించిందిని మిగిలిన వారు ఎవరో తనకు తెలియదని ఇంటి యజమానురాలు వివరించారు.

ఇదీ చదవండి:ములుగు జిల్లాలో చిరుత కలకలం.. భయం గుప్పిట్లో జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.