భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను మేకలు తినేస్తున్నాయి. వాటి యజమానులు నిర్లక్ష్యంగా వదలడం వల్లనే మేకలు హరితహారం మొక్కలు నాశనం చేస్తున్నాయని భావించిన మున్సిపల్ అధికారులు వాటిని బంధించమని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
2019 పురపాలక చట్టం అమలు చేస్తూ.. మేకల యజమానులకు జరిమానా విధించారు. మొక్కలను తిన్న మేకల యజమాని మాధవ లొద్దికి రూ.9 వేలు జరిమానా విధించి.. మరోసారి ఇలా జరగకుండా చూసుకొమ్మని హెచ్చరించారు. పట్టణంలో మేకలు, ఇతర పశువుల యజమానులు వాటిని రోడ్లపైకి రాకుండా చూసుకోవాలని, లేదంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లందు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.
ఇవీ చూడండి: శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు