భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో కరోనా వల్ల మరణించిన ఓ న్యాయవాది అంత్యక్రియలను పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మరి కొందరితో కలిసి నిర్వహించారు. కొవిడ్ కారణంగా మరణించడం వల్ల బంధుమిత్రులు రాలేని పరిస్థితి నెలకొంది.
ఈ పరిస్థితుల్లో పురపాలక ఛైర్మన్ ముందుకొచ్చారు. ఇప్పటికే ఇద్దరి అంతక్రియలు నిర్వహించిన ఆయన పట్టణానికి చెందిన ఓ న్యాయవాది వరంగల్లో చికిత్స పొందుతూ మరణించగా ఇల్లందులో కొవిడ్ నిబంధనలతో అంతక్రియలు నిర్వహించారు.