ETV Bharat / state

'మహిళలు ఆర్థికంగా బలపడే రంగాలు ఎంచుకోవాలి'

బడ్జెట్​లో తమకు రూ.3000 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్​కు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియల చిత్రపటాలకు కొత్తగూడెం జిల్లా ఐకేపీ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. తమ వేతనాలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

mla haripriya, yellandu mla haripriya, bhadradri kothagudem district
ఎమ్మెల్యే హరిప్రియ, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
author img

By

Published : Apr 30, 2021, 3:21 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఐకేపీ ఉద్యోగులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరిప్రియల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బడ్జెట్​లో తమ కోసం రూ.3000 కోట్లు కేటాయించడమే గాక.. ఐకేపీ ఉద్యోగులకు వేతనాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ప్రతిరంగంలోనూ మహిళలు విజయం సాధించాలని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడే రంగాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఏజెన్సీ నియోజకవర్గమైన ఇల్లందులో విద్యావంతులైన యువతకు ఇటీవల పారిశ్రామిక శిక్షణ అధికారుల చొరవతో ఉద్యోగాలు ఇప్పించినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.