భద్రాద్రి రామయ్య సన్నిధిలో(bhadradri temple) హుండీల ఆదాయం(hundi count) లెక్కింపు కొనసాగుతోంది. భక్తులు మొక్కుల రూపంలో స్వామివారికి సమర్పించుకున్న హుండీ ఆదాయాన్ని సిబ్బంది లెక్కిస్తున్నారు. లాక్డౌన్ రోజులు మినహాయించి సుమారు 90 రోజుల హుండీల ఆదాయం లెక్కింపు జరుగుతోంది.
ప్రధాన ఆలయంలోని హుండీలతో పాటు, ఉపాలయాలు, ఆలయ ఆవరణలో ఉన్న హుండీల్లోని నగదును సిబ్బంది లెక్కిస్తున్నారు. సీతా సమేత రాములవారి సన్నిధిలోని చిత్రకూట మండపంలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆలయ ఈవో శివాజీ పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
లాక్డౌన్ ఎఫెక్ట్
కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలన్నీ మూతపడ్డాయి. ఎప్పుడూ భక్తుల రద్దీతో కిటకిటలాడే భద్రాద్రి ఆలయం.. లాక్డౌన్లో వెలవెలబోయింది. స్వామి వారికి అర్చకుల సమక్షంలోనే నిత్యకైంకర్యాలు జరిగేవి. ఆ సమయంలో రామయ్యకు ఆదాయం లేదు. అందుకే లాక్డౌన్ రోజులు మినహాయించి మిగిలిన రోజుల్లోని ఆదాయం లెక్కింపు కొనసాగుతోంది. ఈసారి స్వామివారికి కానుకల ద్వారా ఎంత ఆదాయం చేకూరుతుందో ఇవాళ తేలనుంది.
ఇవీ చదవండి: REVANTH REDDY: పెద్దమ్మ తల్లి గుడిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు