ETV Bharat / state

సీతారాముల కల్యాణ తలంబ్రాలకు అనూహ్య స్పందన.. ఆర్టీసీకి భారీ ఆదాయం

Bhadradri Talambralu: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు చేర్చేందుకు టీఎస్​ఆర్టీసీ కార్గో, పార్శిల్​ సర్వీస్​ విభాగం చేసిన ప్రయత్నానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన లభించింది. 88,704 మంది కల్యాణ తలంబ్రాల కోసం బుక్ చేసుకోగా ఆర్టీసీకి రూ. 70 లక్షలకు పైగా ఆదాయం వచ్చి చేరింది.

talambralu thorugh tsrtc
ఆర్టీసీ ద్వారా భద్రాద్రి తలంబ్రాలు
author img

By

Published : Apr 13, 2022, 11:56 AM IST

Bhadradri Talambralu: టీఎస్​ఆర్టీసీ అందించే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలకు భారీ స్పందన లభించింది. తలంబ్రాల కోసం అధిక సంఖ్యలో భక్తులు నమోదు చేసుకోవడంతో ఆర్టీసీకి రూ.లక్షల్లో ఆదాయం సమకూరింది. రాష్ట్రవ్యాప్తంగా 88,704 మంది భక్తులు సీతారాముల కల్యాణ తలంబ్రాల కోసం బుక్‌ చేసుకున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తొలి బుకింగ్‌ నమోదు చేసుకున్నారు. ఈ బుకింగ్ రూపంలో ఆర్టీసీకి మంచి ఆదాయం లభించింది.

భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకే చేర్చేందుకు ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సర్వీసు విభాగం చేసిన ప్రయత్నానికి భక్తులు అనూహ్య రీతిలో స్పందించారని ఆర్టీసీ వెల్లడించింది. 88, 704 మంది భక్తులు సీతారాముల కల్యాణ తలంబ్రాలను బుక్‌ చేసుకున్నారని వెల్లడించింది. రాములోరి కల్యాణ తలంబ్రాలు కావాలనుకునేవారు ఆన్​లైన్​ ద్వారా రూ. 80 చెల్లించాలి. తద్వారా ఆర్టీసీకి రూ.70,96,320 ఆదాయం సమకూరింది. ఈ నెల 10న సీతారాముల కల్యాణం జరగ్గా.. మంగళవారం నాటికి తలంబ్రాలతో కూడిన పొట్లాలు ఆయా జిల్లాలకు చేరాయని యాజమాన్యం తెలిపింది. నేటి నుంచి భక్తులకు వాటిని అందజేస్తామని వెల్లడించింది.

ఇదీ చదవండి: BADRADRI THALAMBRALU: సీఎం కేసీఆర్​కు భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలు అందజేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.