భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన వరి, మిర్చి పంటలు నీట మునిగాయి. ఈ రోజు ఉదయం నుంచి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునే సమయానికి అకాల వర్షం వారి పాలిట శాపంగా మారింది. ఐకేపీ, సీసీఐ, సొసైటీ శాఖల ద్వారా కొనుగోలు కేంద్రాలు అనుకున్న సమయానికి పంటలను కొనుగోలు చేయలేదు. దీంతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న కల్లాల్లో ఉన్న ధాన్యం రాసులపై వరుణుడు ప్రభావం చూపాడు.
బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో రైతులు ఆరబోసిన మిర్చి వానకు తడిసిపోయింది. బూర్గంపాడు మార్కెట్ యార్డులో అమ్మకానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని ఆరబోస్తే అది తడిసి ముద్దయింది. ఈ ఏడాది కూడా రైతుల పంటలన్నీ నీట మునగడంతో దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
ఇదీ చదవండి: నిరుద్యోగుల సమస్యలపై షర్మిల నిరుద్యోగ దీక్ష